Skip to content

నటుడు రామచంద్రకు ‘మ‌నంసైతం’ ద్వారా కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం

హైదరాబాద్: తెలుగు సినీ నటుడు, ‘మ‌నంసైతం’ నిర్వ‌హ‌కులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవ‌ల‌ పక్షవాతం రావ‌డంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం…

Read more

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రను పరామర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్

పక్షవాతం బారిన పడి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటుడు రామచంద్ర. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఈ రోజు హైదరాబాద్ లో రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను మంచు మనోజ్ పరామర్శించారు. రామచంద్రను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని మనోజ్ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మనోజ్ మాట్లాడారు. రామచంద్ర అనారోగ్యం విషయం ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ అన్నారు. వెంకీ సినిమాలో నటనతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు రామచంద్ర.

Read more