చిత్రపురి కాలనీ పై వచ్చే ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన చిత్తపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ గారు మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. సాధారణంగా చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అందరం ఒక కుటుంబ సభ్యులులాగా కూర్చుని మాట్లాడుకుని మాకు ఉన్న సమస్యల గురించి చర్చించుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో…