అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల
కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. ఈ మూవీలో సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు. ‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ ‘ఫైటర్…