శరవేగంగా అధీర షూటింగ్
యూనిక్, లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ, లార్జర్-దాన్-లైఫ్ సూపర్ హీరో సినిమా కోసం ఆర్.కె.డి స్టూడియోస్ తో కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్‌తో అలరించిన ఆయన, తర్వాత ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ తో సంచలనాన్ని సృష్టించారు. అదే డ్రీంని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా వస్తోంది అధీర. ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తుండగా, కీలక పాత్రలో ఎస్. జే. సూర్య కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రివాజ్ రమేష్ దుగ్గల్ నేతృత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్…
