ఇండస్ట్రీ అంతా కలిసి ముందుకు రావటం నిజంగా అద్భుతం: రణ్‌భీర్ కపూర్
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌భీర్ కపూర్ తన ఇష్టమైన నటి రాణీ ముఖర్జీ 30 వసంతాల ప్రస్థానాన్ని మర్దానీ 3 సినిమాతో సెలబ్రేట్ చేయటానికి భారతీయ సినీ పరిశ్రమ కలిసి ముందుకు రావటం చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రణ్‌భీర్ కపూర్ డెబ్యూ మూవీ సావరియాలో రాణీ ముఖర్జీతో కలిసి నటించారు. ఈ సినీ ప్రయాణంలో క్లిష్ట సమయాల్లో ఆమె అతనికి తోడుగా నిలిచింది. అందుకనే రాణి ప్రయాణంలో, ప్రతి సినిమా సక్సెస్ కావాలని రణ్‌భీర్ కోరుకుంటుటుంటాడు. ఈ సందర్భంగా రణ్‌భీర్ కపూర్ మాట్లాడుతూ ‘‘రాణీ ముఖర్జీ సావరియా చిత్రంలో నాతో కలిసి నటించారు. నేనెంతో కష్టపడి నటించానని నాకు చెప్పి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి తనే. నాకు, ఆమె జరిగిన సంభాషణను…
