Skip to content

సిద్ధు జొన్నలగడ్డతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాట్రిక్ చిత్రం ‘బ్యాడాస్’

'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు 'బ్యాడాస్' అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సిద్ధు జొన్నలగడ్డ మంచి నటుడే కాకుండా, ప్రతిభగల రచయిత కూడా అనే విషయం తెలిసిందే. 'బ్యాడాస్' సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తున్నారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. టిల్లు పాత్రతో వినోదాన్ని పంచి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక…

Read more