Skip to content

“శివోహం” పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా – తనికెళ్ల భరణి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన "శివోహం" పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు…

Read more

ఘనంగా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

మహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిద్ధు గాడి లవ్ స్టోరీ". ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల చారి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు "సిద్ధు గాడి లవ్ స్టోరీ" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై "సిద్ధు గాడి లవ్ స్టోరీ" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - డైరెక్టర్ కావాలనే తన కొడుకు రమేష్ కలను…

Read more