‘మైసా’ నుంచి టీజర్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ల తర్వాత, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వణుకు పుట్టించే ఈ టీజర్, మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్…
