‘రేజర్’ గ్లింప్స్ రిలీజ్
యూనిక్ స్టొరీ టెల్లింగ్, వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రేజర్' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన గత చిత్రం ఎనుగుతొండం ఘటికాచలం వంటి లైట్‌హార్టెడ్ కామెడీకి పూర్తి భిన్నంగా, డార్క్ అండ్ గ్రిట్టీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రవిబాబు–సురేష్ బాబు కాంబినేషన్లో మరోసారి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాత్ర ఇంటన్సిటీ తగ్గట్టుగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో అలరించబోతున్నారు. తాజాగా విడుదలైన…
