Skip to content

సినిమా పేరే ‘రేపు ఉదయం 10 గంటలకు’…. ఫస్ట్ లుక్ విడుదల: చెందు ముద్దు

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్‌ థ్రిల్లర్ 'రేపు ఉదయం 10 గంటలకు'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న చిత్రమిది. మార్చి 3, మంగళవారం ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన తారాగణం. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు…

Read more