సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ ఈవెంట్ నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్విహించబోతున్నాము…
_పి.జి. విందా, మేనేజింగ్ డైరెక్టర్ సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, మరియు కొత్త ఆవిష్కరణలు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో జరిగే ఈ “ సినిమాటికా ఎక్స్పో 2025” ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను నేను, మరియు 'సినిక క్రియేటర్స్ కౌన్సిల్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్…
