“ది 100” ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా: హీరో ఆర్కే సాగర్
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాకి 'ది 100' టైటిల్ పెట్టడానికి కారణం? -మేము ఒక సినిమాలాగే ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను. 'ది 100' అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి…