‘మన శంకరవర ప్రసాద్ గారు’ మీసాల పిల్ల సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల' 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. హిట్‌మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్ “మీసాల పిల్ల”. భీమ్స్ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్-ఇండియా రీచ్ సాధించడం అరుదైన ఘనత. మెగాస్టార్ చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎక్స్ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో…
