ప్రైమ్ వీడియోలో సత్య దేవ్ నటించిన అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో ఆగస్టు 8 న విడుదల
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలిని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి మరియు చింతకింది శ్రీనివాసరావు రూపొందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌కు దర్శకత్వం వహించినది వి.వి. సూర్య కుమార్. అరేబియా కడలిలో ప్రముఖ నటులు సత్యదేవ్ మరియు ఆనంది ప్రధాన పాత్రల్లో నటించగా, నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట…