SYG అందరూ ఎంజాయ్ చేస్తారు : సాయి దుర్గ తేజ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ క్రేజీ పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల యేటిగట్టు) తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ స్టొరీతూ విజువల్ ట్రీట్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది. “సంబరాల ఏటిగట్టు (SYG)” వరల్డ్ ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా వుంది. అంబిషన్‌తో కూడిన మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సాయి దుర్గ…
