‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్’ విడుదల
'మాస్ జాతర' చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే', 'హుడియో హుడియో' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట 'సూపర్ డూపర్'ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. 'మాస్ జాతర' చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ 'సూపర్ డూపర్' గీతముంది. రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే 'మాస్ జాతర' ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ 'సూపర్ డూపర్'…
