కిష్కింధపురిలో నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ వెరీ మెమరబుల్: శాండీ మాస్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. లియో, లోక ఇప్పుడు కిస్కిందపురి వరుస విజయాలు అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది? -చాలా ఆనందంగా ఉంది. ముందుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన లియోలో…
