“లిటిల్ హార్ట్స్” సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలంటూ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ
మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా "లిటిల్ హార్ట్స్" సినిమాకు బెస్ట్ విశెస్ అందించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. తనకు ఇష్టమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేసిందని, "లిటిల్ హార్ట్స్" సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలని విజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. త్వరలోనే "లిటిల్ హార్ట్స్" సినిమా చూస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు. "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s…
