‘శంబాల’ నుంచి ‘పదే పదే’ పాట విడుదల
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం గురించి చెప్పె ‘పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను గమనిస్తే సినిమాలో…
