శివ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది : నాగార్జున
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. అద్భతమైన 4K విజువల్స్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో…
