జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా “గేదెల రాజు” ట్రైలర్ రిలీజ్
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. "గేదెల రాజు" సినిమా నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రావ్య మాట్లాడుతూ - జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం…
