అహా ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘తురుమ్ ఖాన్లు’.. నవ్వులు గ్యారంటీ
తెలంగాణ యాస, భాష నేపథ్యంలో విలేజ్ నేటివీటితో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తురుమ్ ఖాన్ లు. ఈ సినిమా గురించి తెలిసిన ప్రేక్షకులు ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా తురుమ్ ఖాన్ లు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కామెడీ బిట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఆధ్యాంతం అలరించేలా సాగే ఈ చిత్రం ఇన్నాళ్లు ఎక్కడ ఉందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు అంటే... ఈ చిత్రం వారి హృదయాలకు ఎంతలా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన సినిమా…
