అవతార్: ఫైర్ అండ్ యాష్ — ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ!”
'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీకి భారతీయులు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం.. కేవలం అందులోని విజువల్స్, టెక్నాలజీ లేదా ఐమాక్స్ (IMAX) స్కేల్ మాత్రమే కాదు; ఆ కథలో అంతర్లీనంగా ఉన్న పక్కా భారతీయ భావోద్వేగాలే అసలు కారణం. 'అవతార్' సిరీస్లో హీరో జేక్ సల్లి పాత్ర అచ్చం మన భారతీయ కుటుంబ పెద్దల తరహాలోనే ఉంటుంది. కుటుంబానికి అండగా నిలబడటం, పిల్లల రక్షణే పరమావధిగా బతకడం, నైతిక విలువలు, త్యాగనిరతి... ఇవన్నీ ఆయన పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నేటిరి విషయానికి వస్తే—ఆమె ఒక తల్లిగా, యోధురాలిగా ఇంటికి దొరికిన బలం. కుటుంబం కోసం దేన్నైనా ఎదిరించే ఆమె…
