నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” ఫస్ట్ లుక్ విడుదల !!!
జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం…