Skip to content

హీరో సిద్దు జొన్నలగడ్డకు సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్

నటభూషణ శోభన్ బాబు బౌతికంగా లేకపోయినా తాను నటించిన సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకాభిమానులలో చెరగని ముద్రను వేసుకున్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు రెగ్యులర్ గా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి 'సోగ్గాడు' సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని, ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యూత్ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి సోగ్గాడు శోభన్ బాబు పేరిట అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు, అడ్వైజర్ జేష్ఠ రమేష్ బాబు,…

Read more

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’

డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన 'ది టాస్క్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రానుంది. జయసూర్య ఆర్.ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు, కన్నడంలో ఇటీవలనే విడుదలై...అక్కడ విశేష ప్రేక్షకాదరణను చూరగొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిశోర్ తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో 'తల్లి మనసు' వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంత కిశోర్ పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంతా కొత్త వారు నటించారని, తెలుగు…

Read more

పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం

నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా…

Read more