Skip to content

మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ఉట్టిపడేలా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకంగా పసుపు, కుంకుమ బొట్లు, వేపమండలతో అలంకరించిన మట్టి కుండలను విద్యార్థినులు తలపైకి ఎత్తుకుని సందడి చేశారు. విద్యార్థుల పోతుల రాజు, శివ సత్తుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాలల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి కలసి బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ వేడుకల్లో మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పద్మా పల్లవి, ప్రీ…

Read more

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

– ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ‘సమాజంలోని ప్రతి పౌరుడు భవిష్యత్‌ తరాల వారి కోసం మొక్కలను నాటడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలి. అప్పుడే వాయు కాలుష్యం తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. భూగర్భ జలాలు పెరిగి, నీటికీ ఇబ్బందులు ఉండవు’’ అని శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి తెలిపారు. స్మార్ట్‌ లివింగ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబట్టి, ‘మొక్కల పెంపకం చేపట్టాలి’ అంటూ పుర వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏజీఎం కృష్ణ ప్రారంభించారు. అనంతరం కృష్ణ, ఎన్‌.స్వాతి…

Read more