బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్
హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్‌లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్ లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది…
