‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం - సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'హరి హర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 'హరి హర వీరమల్లు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ…