“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన " పోలీస్ వారి హెచ్చరిక" టీజర్ ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ... "దర్శకుడు బాబ్జీ మా మామగారైన సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా దగ్గరివాడు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణ…