#SDT19 అనౌన్స్‌మెంట్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #SDT19 ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ సినీ ప్రియుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. #SDT19 సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్ కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది. దర్శక ద్వయం సుజిత్ & సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరు “క” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. #SDT19తో వీరి విజన్ మరింత విస్తరించబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మిథిక్ సై-ఫై (Mythic…
