Skip to content

సుకృతి వేణిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి గారు అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉత్తమ బాలనటిగా పురస్కారానికి ఎంపికైన సుకృతి వేణితో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, చిత్ర సమర్పకురాలు, సుకుమార్‌ సతీమణి తబితా సుకుమార్‌ 'గాంధీ తాత చెట్టు' చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్‌, శేష సింధురావులు సీఏం రేవంత్‌ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుకృతివేణితో పాటు నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించారు. 71 జాతీయ అవార్డ్స్ లో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతివేణి ఆ…

Read more

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ),…

Read more