Skip to content

లేత గులాబీ టైటిల్ లాంచ్

79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శతాధిక చిత్రాల హీరో సుమన్ గారు మరియు శతాధిక చిత్రాల దర్శకులు శ్రీ ఓం సాయి ప్రకాష్ గారు లేత గులాబీ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేసి దర్శకుడు మరియు నిర్మాతలను ఆశీర్వదించారు. వారాహి మీడియా హౌస్ సమర్ప ణ లో మీనాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై సుందర్ దర్శకత్వంలో శ్రీనివాస్ మరియు ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం లేత గులాబి. విభిన్న ప్రేమ కథ తో పాటు సమాజ హిత సందేశాత్మక ఈ చిత్రానికి వెంకట్ బాలగోని సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మీడియాకు చెప్పారు.

Read more

ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభం

భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్…

Read more

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ట్రైలర్ లాంచ్

యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిడం ఆనందంగా వుంది. ఆగస్టు 22న సినిమా రిలీజ్ అవుతుంది. నిర్మాత ఉమా గారికి…

Read more

తానా సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను నంది అవార్డ్ తో సత్కరించిన టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను ఘనంగా సత్కరించారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ నుంచి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - మన లక్ష్మీ గారికి తానాలో ఘన సన్మానం జరగడం మనందరికీ గర్వకారణం. తానాలో సత్కారం పొందిన లక్ష్మీ గారిని…

Read more