సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు…
