యూకే సినీప్లెక్స్ నాచారంలో ప్రారంభం
హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన అనుభవానికి.. వినోదానికి మరో చిరునామా చేరింది... అదే యూకే సినీ ప్లెక్స్. హైదరాబాద్‌లోని నాచారంలో అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించిన ఈ యూకే సినీ ప్లెక్స్‌ను బుధవారం ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ యూకే సినీప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ఎంతో ఉన్నతంగా ఉంది. సౌండ్ సిస్టమ్, స్క్రీన్, సీట్లు ఎంతో బాగున్నాయి. ఉప్పల్, హబ్సిగూడ, నాచారంలో ఉండేవారికి ఈ మల్టీప్లెక్స్ వినోదాన్ని పంచడంలో సరికొత్త ఎక్స్ పీరియన్ష్ ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో శ్రీమతి పృతికా ఉదయ్ , శ్రీ రుషిల్ ఉదయ్‌లతో…
