Skip to content

శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. "ప్రతి యువకుడి కథ"(The Story of Every Youngster) అనే అద్భుతమైన ట్యాగ్‌లైన్‌తో ఆవిష్కరించబడిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా యొక్క ఆలోచనాత్మక మరియు భావోద్వేగాలతో కూడిన ప్రపంచంలోకి ఈ పోస్టర్ ప్రేక్షకులను తీసుకొని వెళుతుంది. తనదైన వినోదాత్మక నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, అన్ని రకాల భావోద్వేగాలను గొప్పగా పలికించగల సామర్థ్యమున్న నటుడిగా పేరుగాంచిన శ్రీ విష్ణు, ఈ సినిమాలో మరో చిరస్మరణీయ…

Read more