Skip to content

ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం ప్రారంభం

టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్త‌పు స‌న్నివేశానికి రామ్ అబ్బ‌రాజు క్లాప్ నివ్వ‌గా, ప్ర‌శాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్ అబ్బ‌రాజు, ప్ర‌శాంత్ దిమ్మెల‌, అడిదాల విజ‌య్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా... * హీరో పవన్ కేసరి మాట్లాడుతూ* .. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ…

Read more

సినీ కార్మికుల చర్చలు సఫలం.. నేటి నుంచి షూటింగ్స్‌ షురూ!

టాలివుడ్‌ వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. లేబర్‌ కమిషనర్‌ మధ్య వర్తిత్వంతో నిర్మాతలకు, కార్మిక సంఘాల మధ్య గురువారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో 18 రోజుల విరామానికి తెరపడినట్లైంది. కార్మికులంతా శుక్రవారం నుంచి యధావిధిగా షూటింగ్స్‌కు హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఫిలిం కార్పొరేషన్‌ డెవెవెలప్‌మెంట్‌ చైర్మన్‌ దిల్‌రాజు, అదనపు కమిషనర్‌ ఈ.గంగాధర్‌ ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రెమ్యునరేషన్‌ పెంచాలని కోరుతూ సినీ కార్మికులు గత కొంతకాలం గా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర ప్రసాద్, డైరెక్టర్ తేజ, నిర్మాతలు స్రవంతి రవికిషోర్,…

Read more

*‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’ లాంటి ఆదర్శమైన చిత్రాలు మరెన్నో రావాలి అని చిత్ర గుమ్మడికాయి ఈవెంట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి*

సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ పతాకాలపై సిరాజ్‌ ఖాదరన్‌ గోరి నిర్మిస్తున్నరు. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌ ప్రభు, సాయి విజయేందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీమ్‌ అందరికీ షీల్డ్‌లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘అన్నపూర్ణమ్మ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా తెలీదు. పవన్‌ కల్యాన్‌ వల్ల ఆమె పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది…

Read more