జనవరి 1న ఆది రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’ హిందీలో విడుదల
ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రానికి ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 1న హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వేచి ఉందని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు తెలిపారు. ఇక హిందీలో ‘శంబాల’ రిలీజ్ అవుతోందని తెలియడంతో ట్రేడ్ వర్గాల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అక్కడ మన ‘శంబాల’ ఎలాంటి ఫలితాన్ని…
