ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు చిత్ర కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ, తనకు అడ్డువచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొగల్ పాలకుడు…
