Skip to content

ప్రైమ్ వీడియోలో హరి హర వీరమల్లు

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన తాజా చిత్రం హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది.. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పీరియడ్ అడ్వెంచర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మొఘల్ కాలం నాటి ఈ కథలో, వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు చక్రవర్తి ఔరంగజేబు కోట నుండి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని…

Read more

కన్యా కుమారి మంచి సినిమా అవుతుంది: సిద్ధు జొన్నలగడ్డ

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..అందరికీ గుడ్ ఈవెనింగ్. మధు ఎప్పటినుంచో నాకు తెలుసు. తను ఒక సినిమాని ప్రజెంట్…

Read more

విజయవాడలో తొలి U&i రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన సినీ తార నభా నటేష్..

- దేశంలోని ప్రధాన నగరాల్లో బ్రాండ్ విస్తరణలో భాగంగా ప్రత్యేక స్టోర్... - - అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్ వరకు అందుబాటులో... విజయవాడ, 20 ఆగస్టు 2025: భారతదేశంలోని ప్రముఖ గాడ్జెట్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి U&i మొట్టమొదటి ప్రత్యేకమైన రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్, గవర్నర్ పెట్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటి నభా నటేష్ ముఖ్య అతిథిగా హాజరై U&i స్టోర్ ను ప్రారంభించారు. ఇందులో సంస్థ డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రత్యేక స్టోర్‌లతో తమ విస్తృత శ్రేణి ఉత్పత్తులను, ఆడియో పరికరాలు, బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్, లైఫ్…

Read more

‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అవుతుంది.. నిర్మాత వెంకట్ ఆర్. పాపుడిప్పు

యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక బుధవారం (ఆగస్ట్ 20) నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.   ‘నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ అద్భుతంగా ఆరంభమైంది. ‘ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం…

Read more

సుకృతి వేణిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి గారు అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉత్తమ బాలనటిగా పురస్కారానికి ఎంపికైన సుకృతి వేణితో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, చిత్ర సమర్పకురాలు, సుకుమార్‌ సతీమణి తబితా సుకుమార్‌ 'గాంధీ తాత చెట్టు' చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్‌, శేష సింధురావులు సీఏం రేవంత్‌ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుకృతివేణితో పాటు నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించారు. 71 జాతీయ అవార్డ్స్ లో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతివేణి ఆ…

Read more

గుర్రం పాపిరెడ్డి” నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో "గుర్రం పాపిరెడ్డి" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి 'ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..' పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో…

Read more

‘అర్జున్ చక్రవర్తి’ అందరికీ కనెక్ట్ అవుతుంది: నిర్మాత శ్రీని గుబ్బల

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి ? -మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్ళు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీ పై ఆసక్తి ఉంది. మేం…

Read more

పరదా’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది : నిర్మాత విజయ్ డొంకాడ

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ డొంకాడ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పరదా కథని టేకాఫ్ చేయడానికి కారణం? -డైరెక్టర్ ప్రవీణ్…

Read more

ఘనంగా త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవం

నిర్మాత హరిత గోగినేని, ఏఆర్ అభి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపి ఒక కొత్త మార్గాన్ని త్రివణ గురుపీఠం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ - ఈ రోజు త్రివణ గురుపీఠం విజయవంతంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. వివిధ పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఆ దేవుడి కృప దక్కిందని నమ్ముతున్నాను. రాలేకపోయిన వారికి కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. త్రివణ గురుపీఠం అనేది డివోషనల్, స్పిరిచువల్,…

Read more

టీనేజ్ లైఫ్ లోని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను “లిటిల్ హార్ట్స్” మూవీలో లైవ్ లీగా చూపించారు – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు…

Read more