Skip to content

యశ్ ‘టాక్సిక్’ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్ ‘టాక్సిక్’ మూవీని కొనుగోలు చేసింది. ఇది సినిమా అసాధారణ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్‌లో…

Read more

‘టాక్సిక్‌’ తెలుగు హ‌క్కుల‌ను రూ.120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

రాకింగ్ స్టార్ య‌శ్ ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. మార్చి 19న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు సంబంధించిన హ‌క్కుల‌ను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ క‌మీష‌న్ బేసిస్‌)కు సొంతం చేసుకోవ‌టం ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది. ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు…

Read more

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి వ‌స్తోన్న క్రేజీ అప్‌డేట్స్‌తో అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రోజున రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తుంటే ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే విష‌యం తెలుస్తోంది. య‌ష్‌, గీతూ మోహన్ దాస్ కాంబో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు య‌ష్‌తో క‌లిసి రుక్మిణి వ‌సంత్ న‌టించ‌టంతో ఇదింకా ప్ర‌త్యేక‌తంగా అనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గీతు క‌థలో చెప్పాల‌నుకున్న డెప్త్, సీరియ‌స్‌నెస్ అర్థం…

Read more

‘టాక్సిక్‌: ’లో రెబెకా పాత్ర‌లో తారా సుతారియా

రాకింగ్ స్టార్ య‌ష్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’పై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈసినిమా నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియ‌స్‌, గ్లామ‌ర‌స్ ఎలిజిబెత్ పాత్ర‌లో న‌టిస్తోన్న హుమా ఖురేషి.. పవర్ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై టాక్సిక్ సినిమాలోని డార్క్ వ‌ర‌ల్డ్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేశాయి. తాజాగా మేక‌ర్స్ అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, సున్నిత‌మైన రెబెకా పాత్ర‌లో న‌టిస్తోన్న తారా సుతారియా పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఇలా సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా.. సినిమా స్కేల్ పాన్ ఇండియా రేంజ్‌ను తెలియ‌జేస్తోంది. ఇందులో హై యాక్ష‌న్ సీక్వెన్సెస్‌, భారీ డ్రామా, క‌థ‌లోని…

Read more

‘టాక్సిక్ ’ నుంచి హుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్ రిలీజ్

- టాక్సిక్ సినిమాతో చేయ‌బోతున్న ప్ర‌యోగం, సాహ‌సం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పిన బాలీవుడ్ నటి రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్ర‌లో న‌టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వైవిధ్య‌మైన పాత్రలను ఎంచుకుంటూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న‌ హుమా ఖురేషి..టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతోంది. 2026లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై లేటెస్ట్‌గా హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌తో బజ్ మరింత పెరిగింది…

Read more

‘టాక్సిక్‌ ’లో నాడియా పాత్ర‌లో కియారా అద్వానీ

2026లో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ హీరోగా నటిస్తోన్న‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్’ ఒక‌టి. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న‌ హీరోయిన్ కియారా అద్వానీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టంతో ఫ్యాన్స్‌లో మ‌రింత ఉత్సాహం పెరిగింది. ఎమోష‌న‌ల్, హై వోల్టేజ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ఇలా... వైవిధ్యమైన సినిమాలు, పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ . ఇప్పుడు గీతూ మోహ‌న్ దాస్ రూపొందిస్తోన్న శ‌క్తివంత‌మైన ప్ర‌పంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్ర‌ఫీ రేంజ్‌లో మ‌రింత పెంచేలా…

Read more

‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే

‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మ‌రో వంద రోజుల స‌మయం మాత్ర‌మే ఉంది. వ‌చ్చే ఏడాది అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ నుంచి ఓ స‌రికొత్త‌, ప‌వ‌ర్ఫుల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్ ఇందులో క‌నిపిస్తున్నాడు. మెలి తిరిగిన కండ‌ల‌తో త‌నొక…

Read more

య‌ష్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ మార్చి 19 రిలీజ్‌

రాకింగ్ స్టార్ యశ్ హీరో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌నుందంటూ పుకార్లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఫిల్మ్ క్రిటిక్ త‌ర‌ర‌ణ్ ఆద‌ర్శ్ నిర్మాత‌ల‌ను సంప్ర‌దించి విడుద‌ల తేదీపై క్లారిటీ తీసుకున్నారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా రిలీజ్ డేట్‌పై వ‌చ్చిన రూమ‌ర్స్‌కి చెక్ పెట్టారు. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించిన‌ట్లే మార్చి…

Read more

‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘టాక్సిక్’ టీం ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను జె.జె. పెర్రీని రంగంలోకి దించారు. హాలీవుడ్ టీంతో ఇప్పటి వరకు ‘టాక్సిక్’లో అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌లను జె.జె. పెర్రీ చిత్రీకరించారు…

Read more