Skip to content

2026 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా “నువ్వు నాకు నచ్చావ్” 4K లో రీ-రిలీజ్

24 ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 6 న తెలుగు తెర పై ఒక మ్యాజిక్ జరిగింది. అదే “ నువ్వు నాకు నచ్చావ్ “ సినిమా. ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత ఆత్మ సంతృప్తి. ఇప్పటికి చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్ కొట్టనంత రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమా తో చిల్ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4 కె లో రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ లోటు ని తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1 న…

Read more

“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” చిత్రీకరణ ప్రారంభం

తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే…

Read more