భద్రకాళి’ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
హీరో విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'భద్రకాళి'తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు…
