Skip to content

ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇది మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) బయోపిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల ది గ్రేట్’ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య…

Read more

క్రమశిక్షణే ఎవరికైనా “లక్ష్మణరేఖ”

"లక్ష్మణరేఖ" గోల్డెన్ జూబిలీ వేడుకలో మురళీ మోహన్ - జయసుధ గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్ - జయసుధ జంటగా నటించిన "లక్ష్మణ రేఖ" చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన రాజేంద్రప్రసాద్ లను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు రామసత్యనారాయణను అభినందించారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్. రామచంద్రరావు, తెలుగు…

Read more

ఈ ఘనత నా ఒక్కడిదే కాదు మన టాలీవుడ్ లో ప్రతి ఒక్కరిది!!

ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం నిర్మాతగా డబుల్ సెంచరీ సాధించడం నా జీవితాశయం -వరల్డ్ రికార్డ్ హోల్డింగ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డా: డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు!! తన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని తుమ్మలపల్లి పేర్కొన్నారు. అయితే ఈ ఘనత…

Read more

ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభం

భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్…

Read more

ప్రపంచ సినిమా చరిత్రలోనే ప్రప్రథమం ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా ఘనతకెక్కిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైద్రాబాద్ లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది!!

Read more