ఆశ షూటింగ్ ప్రారంభం
మలయాళ సినిమా పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీ ఆశలో నటిస్తున్నారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో, వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, మధు నీలకందన్ కెమరా స్విచ్-ఆన్ చేశారు. ఈ వేడుకలో ఆశ టైటిల్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు, ఇది ఆడియన్స్…
