Skip to content

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్‌ విడుదల

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. '90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ…

Read more

ప్రజల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా” యాప్

రోగుల‌కు ఉచితంగా ఓపీ సేవ‌లు అందించేందుకు కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్ ల‌క్డీక‌పూల్ లోని FTCCI కేఎల్ ఎన్ ఆడిటోరియంలో ఈ నెల 15 న ఈ-ఆశా ఓపీ యాప్ ను సెల‌బ్రిటీలు లాంచ్ చేయ‌నున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు నాయకంటి పృథ్వీరాజ్ తెలిపారు .ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వంద‌కు పైగా హాస్పిట‌ల్స్ తో ఒప్పందం చేసుకున్నామ‌ని... పేషంట్ల‌కు ఎలాంటి ఫీజుల లేకుండా సేవ‌లు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు .ఈ యాప్ ద్వారా ఓపీ బుక్ చేసుకున్న రోగుల‌కు త‌క్కువ స‌మ‌యంలో వైద్యులను క‌లిసి చికిత్స‌లు చేయించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు డెవలపర్స్ టీం లీడ్ వైష్ణ‌వి తెలిపారు . రోగుల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా”…

Read more

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more

నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్…

Read more

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more

సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభం

కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయన్ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా జరిగింది. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన వైద్య చికిత్సను సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ అందిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డా.శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బి.రెడ్డి, వారి కూతురు అక్షత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. శ్రీ రెడ్డి మాట్లాడుతూ - సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు థ్యాంక్స్…

Read more