‘డెకాయిట్’ నుంచి లవ్ మెలోడీ ‘రుబరూ’ రిలీజ్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్ లో డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా మదనపల్లె స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా విడుదలైన “రుబారూ” పాట ప్రేమ, బాధల కలయికగా అందరినీ హత్తుకుంటోంది. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన స్వరాలు రస్టిక్ టచ్‌తో మెలోడీని మరింత ఎలివేట్ చేసింది. ఆయనతో పాటు చిన్మయి వాయిస్ ఈ పాటకు…
