పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్ విడుదల
బాహుబలి ఫ్రాంఛైజీ, ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కతున్న సినిమా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా నుంచి అప్‌డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూసిన ప్రేక్షకులకు శుభవార్త అందింది. పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు విజనరీ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అప్ కమింగ్ మెగా ప్రాజెక్టులో పృథ్విరాజ్ ఫస్ట్ లుక్ ఇంటెన్స్, పవర్‌ఫుల్ సినిమాటిక్ థీమ్‌తో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. మలయాళం ఇండస్ట్రీ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్‌ని కుంభగా పరిచయం చేశారు రాజమౌళి. వరల్డ్…
