‘వీరభద్రుడు’ మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'కరుప్పు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ పెట్టారు. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది…
