అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్!
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేశారు. ''మన లైఫ్ లో ఏవైతే ముఖ్యమో అవన్నీ ఇన్సూరెన్స్ చేస్తున్న ఈ లోకంలో ఇన్సూరెన్స్ చేయడానికి ఏదైనా దారి లేదా.. ఆ దారి.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అంటూ ఎస్జే సూర్య…
