పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం ఆమె తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు. ఈ నెల 28న సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు. పాయల్ రాజ్‌పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్‌పుత్ ‘RX 100’, ‘వెంకీ…
